: దిగ్భ్రాంతి చెందిన టాలీవుడ్


మూవీ మొఘల్ రామానాయుడు అనారోగ్యంతో మరణించడంతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న రామానాయుడు ఇక లేరన్న విషయాన్ని టాలీవుడ్ లోని అన్ని విభాగాలకు చెందిన ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుంటారని భావించినా, ఆయన మరణించడంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ, తదితరులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, ఏపీ స్పీకర్ కోడెల, ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News