: రామానాయుడు మృతికి కోడి రామకృష్ణ సంతాపం
దిగ్గజ నిర్మాత రామానాయుడు కన్నుమూయడం పట్ల సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ స్పందించారు. రామానాయుడు మృతికి సంతాపం తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అన్ని భాషల్లో సినిమాలు తీయడం గొప్ప కాదని, ఏ భాషలో తీసినా ఆ సినిమా హిట్టయితేనే నలుగురూ చెప్పుకుంటారని రామానాయుడు ఎన్నోసార్లు పేర్కొన్నారని కోడి రామకృష్ణ తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి ఆయన ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించడం తెలిసిందే. దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ సినిమాలు నిర్మించిన ఘనత రామానాయుడు సొంతం.