: విరాట్ కోహ్లీ కసి ఉన్న ఆటగాడు: అనుష్క శర్మ


టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీపై ప్రేయసి అనుష్క శర్మ ప్రశంసల జల్లు కురిపిస్తోంది. కోహ్లీ కసి ఉన్న ఆటగాడని కితాబిచ్చింది. తాజా చిత్రం 'ఎన్.హెచ్.10' ప్రమోషన్ ఈవెంట్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కోహ్లీ రాణించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నానని తెలిపింది. దాయాదుల సమరంపైనా తన అభిప్రాయాలు పంచుకుంది. ఆ మ్యాచ్ చాలా ముఖ్యమైనదని తెలిపింది. గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరూ ఇటీవలే తమ అనుబంధాన్ని అంగీకరించడం తెలిసిందే. అన్నట్టు... భారత్, పాక్ మ్యాచ్ అనంతరం అమ్మడు కోహ్లీతో మాట్లాడిందట.

  • Loading...

More Telugu News