: అంతర్ రాష్ట్ర ప్రాజెక్టుల కోసం టీఎస్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు
ప్రతి రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలతో చిన్నా, చితకా సమస్యలు ఉండటం సహజమే. కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఏపీ లాంటి రాష్ట్రాలకైతే ఇవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో, అంతర్ రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణం, వివాదాల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం 'టెక్నికల్ అడ్వైజరీ కమిటీ'ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఛైర్మన్ గా రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఎన్.గోపాల్ రెడ్డి వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా అబ్దుల్ రవూఫ్, కె.వేణుగోపాలరావులను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఈ కమిటీ సలహాలను కూడా ఇవ్వనుంది.