: ఈ నెలలో రాజధాని గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ పర్యటన


ఏపీ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఈ నెల 23న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం పర్యటించనుంది. ఈ సమయంలో భూసేకరణపై రైతుల అభ్యంతరాలు, సమస్యలు, ప్రభుత్వ ఒత్తిడి తెలుసుకుని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత పార్థసారధి తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధానికోసం భూసేకరణలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా ముందుకెళుతోందని, చంద్రబాబు సర్కారు రైతుల భూములతో వ్యాపారం చేసి కోట్లు గడించాలన్న కుట్ర చేస్తోందని విమర్శించారు. అయితే తుళ్లూరులో రాజధానికి తాము వ్యతిరేకంగా కాదని తెలిపారు.

  • Loading...

More Telugu News