: పార్టీలకు అతీతంగా అధికారులు పనిచేయాలి: ఎంపీ మేకపాటి హెచ్చరిక
ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు నెల్లూరు వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సూచించారు. పార్టీలకు అతీతంగా అధికారులు పనిచేయాలని, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులను సహించమని హెచ్చరించారు. నెల్లూరులో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.