: దానమివ్వడం గొప్పకాదంటున్న ఐటీ దిగ్గజం


తన వ్యక్తిగత సంపదలో ఇప్పటికే 25 శాతం దాతృత్వ సేవల కోసం విరాళంగా ఇచ్చిన విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ ఏమంటున్నాడో వినండి. విరాళాలివ్వడం గొప్పకాదని, ఆ నిధులు సక్రమంగా ఖర్చయ్యేలా చూడడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ప్రేమ్ జీ గత ఫిబ్రవరిలో తన సంపద నుంచి రూ.12,300 కోట్ల విలువైన షేర్లను దాతృత్వ సేవలకు అందిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు కూడా ప్రేమ్ జీ 2010లో విప్రోలో తన పేరిట ఉన్న వాటాల్లో 8.7 శాతం వాటాలను స్వచ్ఛంద సేవల కోసం బదలాయించారు.

తాజా వితరణ నేపథ్యంలో ప్రేమ్ జీ మాట్లాడుతూ, తాము వితరణ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని, అయితే ప్రభుత్వం తామందించే నిధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఇదిలావుంటే, మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ స్థాపించిన 'గివింగ్ ప్లెడ్జ్' క్లబ్ లో ప్రేమ్ జీకి కూడా స్థానం దక్కింది. ఈ ప్రతిష్ఠాత్మక వితరణ శీలుల క్లబ్ లో స్థానం దక్కించుకున్న తొలి భారతీయుడు ప్రేమ్ జీనే. ఈ క్లబ్ లో అమెరికా స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News