: నెలన్నర వ్యవధిలో 624 మందిని పొట్టనబెట్టుకున్న మహమ్మారి
గడచిన నెలన్నర వ్యవధిలో స్వైన్ ఫ్లూ కారణంగా ఇండియాలో 624 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి 1 నుంచి మరణించిన వారి అధికార సంఖ్య ఇది. ఇప్పటివరకు 9,311 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్టు తేలిందని వివరించారు. ఈ వ్యాధితో రాజస్థాన్ లో అత్యధికంగా 176 మంది, గుజరాత్ లో 150 మంది, తెలంగాణలో 46 మంది, మహారాష్ట్రలో 58 మంది, మధ్యప్రదేశ్ లో 81మంది బలయ్యారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో గడిచిన నాలుగు రోజుల్లోనే సుమారు 139 మంది మృతి చెందారు. వాస్తవానికి స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని అంచనా.