: తెలంగాణలో విద్యుత్ కోతల్లేవట... కేసీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు: ఎర్రబెల్లి


ఢిల్లీ, మహారాష్ట్ర పర్యటనలను ముగించుకుని వచ్చిన తెలంగాణ సీఎంపై విమర్శల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కేసీఆర్ పర్యటనపై టీ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి విరుచుకుపడగా, ఆ మరుక్షణమే టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శలు కురిపించారు. అసలు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన సీఎం సాధించిందేముందని ఎర్రబెల్లి ప్రశ్నించారు. మహారాష్ట్ర, తెలంగాణకు మధ్య వివాదాల్లో కీలకమైన బాబ్లీ ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్ర సీఎంతో కేసీఆర్ చర్చ జరపకపోవడం దారుణమన్నారు. ప్రజలు విద్యుత్ కోతలతో సతమతమవుతుంటే, రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవంటూ కేసీఆర్ సిగ్గు లేకుండా ప్రకటనలు చేస్తున్నారని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News