: భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 4 ధర తగ్గింపు
2013లో శాంసంగ్ కంపెనీ నుంచి వచ్చిన ప్రధాన గెలాక్సీ ఎస్ 4 ఫోన్ ఇప్పుడు భారత్ లో తగ్గింపు ధరలో దొరుకుతోంది. అధికారికంగా డీలర్స్ ద్వారా రూ.17,999కు అందుబాటులో ఉంటుంది. గతంలో దాని రేటు రూ.21,900 ఉంటే ప్రస్తుతం రూ.3,900 తగ్గించారు. అటు ఆన్ లైన్ లో ఈ ఫోన్ ను పదిహేడువేలుగానే అమ్ముతున్నారు. త్వరలో ఈ ధర దేశంలోని శాంసంగ్ కంపెనీ అధికారిక ఇ-స్టోర్స్ లోనూ అమలవనుంది. మొదట్లో శాంసంగ్ ఎస్ 4 రేటు రూ.41,500గా ఉంది. అయితే గతేడాది పలు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ల ధరలు భారీ స్థాయిలో తగ్గాయి.