: అతిథిగా వస్తే, రక్తం వచ్చేలా కొట్టాము... భారతీయుడికి క్షమాపణ చెప్పిన యూఎస్ గవర్నర్
తమ దేశానికి వచ్చిన అతిథిపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించడాన్ని ఒక దురదృష్ట ఘటనగా అమెరికాలోని అలబామా గవర్నర్ రాబర్ట్ బెంట్లే అభివర్ణించారు. ఈ మేరకు బాధితుడికి ఆయన క్షమాపణ చెప్పారు. దీనిపై ఎఫ్ బీఐ విచారణ ప్రారంభం అయిందని, తన క్షమాపణను అంగీకరించాలని ఇండియా కాన్సులేట్ జనరల్ కు రాసిన లేఖలో ఆయన కోరారు. కాగా, అమెరికాలో ఉద్యోగిగా వున్న కొడుకు దగ్గరికి వెళ్ళిన ఇంగ్లీషు తెలియని వ్యక్తి పటేల్ (57)పై అక్కడి పోలీసులు దారుణంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికాలోని భారతీయులు, హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. తమ పోలీసుల చర్య తప్పేనని రాబర్ట్ అంగీకరించారు.