: మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.వెంకట్రామిరెడ్డి కన్నుమూత
మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.వెంకట్రామిరెడ్డి(84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని మల్లెంపూడి. 1987 నుంచి 1993 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.