: రెండు గుర్రాలపై స్వారీ ఎలా చేస్తారు?: టీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఊహాగానాలపై సీఎం రమేశ్


బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య పొత్తు ఊహాగానాలు ఊపందుకున్న దరిమిలా టీడీపీ గళమెత్తింది. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామంటే చెప్పండి, మేం కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటామంటూ బీజేపీకి హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాక ఒకే ప్రాంతానికి చెందిన రెండు వేర్వేరు పార్టీలతో ఎలా పొత్తు పెట్టుకుంటారంటూ ఆ పార్టీ కీలక నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సీఎం రమేశ్ ప్రశ్నిస్తున్నారు. 'ఒకే సమయంలో రెండు గుర్రాలపై స్వారీ చేయడం ఎంతవరకు సబబో, మీరే ఆలోచించుకోండి' అంటూ ఆయన కాస్త నిష్ఠూరంగానే మాట్లాడారు. తెలంగాణను వేధిస్తున్న నిధుల కొరతను తీరిస్తే, ఎన్డీఏలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ మోదీ వద్ద ప్రతిపాదించారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాక తన కూతురు కవితకు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇప్పించుకునేందుకు కూడా ఆయన ఈ దిశగా యత్నాలను ముమ్మరం చేశారన్న వదంతులు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల నేపథ్యంలో ఈ విషయంపై సీఎం రమేశ్ ఓ ఆంగ్ల దినపత్రికతో ఘాటుగా స్పందించారు.

  • Loading...

More Telugu News