: మన తల్లులేమీ సంతానోత్పత్తి ఫ్యాక్టరీలు కాదు: సాక్షి వ్యాఖ్యలకు మోహన్ భగవత్ ఖండన


ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురికి జన్మనివ్వాలని గతనెలలో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ పేర్కొన్న సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మండిపడ్డారు. మన మహిళలు సంతానోత్పత్తి చేసే ఫ్యాక్టరీలు కాదని హితవు పలికారు. కాన్పూర్ లో ఆయన సంఘ్ పరివార్ సమావేశంలో మాట్లాడుతూ, "హమారీ మాతాయే ఫ్యాక్టరీ నహీ హై, బచ్చా పైదా కర్ణా వ్యక్తిగత్ నిర్ణయ్ హై" (మన తల్లులేమీ ఫ్యాక్టరీలు కాదు, పిల్లలను ఉత్పత్తి చేయడానికి... ఓ బిడ్డకు జన్మనిచ్చే అంశం వ్యక్తిగతమైనది) అని పేర్కొన్నారు. వ్యాఖ్యలు చేసేముందు ముందూవెనకా ఆలోచించాలని అన్నారు. అంతకుముందు, వున్నావో ఎంపీ సాక్షి మహారాజ్ ప్రతి హిందూ స్త్రీ నలుగురిని కనడం ద్వారా హిందూ మతాన్ని కాపాడేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. నలుగురిలో ఒకరిని సైన్యంలో చేర్చాలని, మరొకరిని మతానికి అంకితం చేయాలని, మిగిలిన ఇద్దరూ కుటుంబం కోసం పనిచేయాలని ఆయన వివరణాత్మకంగా ప్రబోధించారు.

  • Loading...

More Telugu News