: ఓపెనర్ల వికెట్లు చేజార్చుకున్న బంగ్లాదేశ్
వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. కాన్ బెర్రాలోని మనూకా ఓవల్ ఈ పోరుకు వేదిక. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓ మోస్తరు శుభారంభాన్నిచ్చిన బంగ్లా ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (19), అనాముల్ హక్ (29) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ ఇద్దరినీ ఆఫ్ఘన్ పేసర్ మిర్వాయిస్ అష్రాఫ్ పెవిలియన్ చేర్చాడు. 24 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా స్కోరు 2 వికెట్లకు 86 పరుగులు కాగా, సౌమ్య సర్కార్ (17 బ్యాటింగ్), మహ్మదుల్లా (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.