: అంతులేని దారుణాలు... 45 మందిపై పెట్రోలు పోసి నిప్పంటించి, హతమార్చిన ఐఎస్ఐఎస్ కిరాతకులు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దారుణాలకు అంతులేకుండా పోతోంది. మొన్నటికి మొన్న 21 మందిని మోకాళ్ళపై కూర్చోబెట్టి తలలు తెగ్గోసిన ఈ కిరాతకులు, నిన్న మరో 45 మందిని సజీవదహనం చేశారు. వీరిని బంధించి పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్టు తెలిసింది. ఈ ఘటన పశ్చిమ ఇరాక్ లోని అల్-బాగ్దాది పట్టణం సమీపంలో జరిగినట్టు పోలీసులు తెలిపారని వార్తా సంస్థ బీబీసీ తెలియజేసింది. వీరిలో కొందరు సైనికులని తెలుస్తోంది. వీరి సజీవ దహనానికి దారితీసిన కారణాలు వెల్లడి కాలేదు.