: పాకిస్థాన్ బోటును మేమే పేల్చేశాం... లేకుంటే వారికి బిర్యానీ పెట్టాల్సి వచ్చేది: గుజరాత్ డీఐజీ
దేశమంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ, పాకిస్థాన్ నుంచి జలమార్గం ద్వారా గుజరాత్ తీరానికి చేరి మారణకాండ సాగించాలన్న ఉద్దేశంతో వస్తున్న ఉగ్రవాదుల మరపడవ పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అసలు విషయాన్ని గుజరాత్ తీరప్రాంత రక్షక దళం డీఐజీ బయటకు వెల్లడించారు. ఆ బోటును తామే పేల్చివేశామని, లేకుంటే ఉగ్రవాదులను తెచ్చి బిర్యానీలు పెట్టాల్సి వచ్చేదని డీఐజీ బీ.కే.లోషాలి తెలిపారు. ఇటీవల తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో లోషాలి ఈ వ్యాఖ్యలు చేశాడని ఆంగ్ల దినపత్రిక ఒకటి ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ బోటును పేల్చివేయాలని తనే స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్టు లోషాలి చెప్పారట.