: ఎన్నికల్లో డబ్బు పంచేది లేదు... ఖర్చు కోసం చేయి చాచేదీ లేదు: ఏపీ సీఎం చంద్రబాబు


ఎన్నికల నిర్వహణపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొత్త భాష్యం చెప్పారు. ఇకపై ఎన్నికల్లో పార్టీ డబ్బులు పంచదని, ఖర్చుల కోసం ఎవరి వద్ద చేయి చాచేది కూడా లేదని ఆయన కరాఖండిగా చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించిన సుగుణమ్మ, చిత్తూరు జిల్లా నేతలు నిన్న హైదరాబాదులో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఖర్చు అంశం ప్రస్తావనకు వచ్చిందట. ఇకపై జరిగే ఏ ఎన్నికల్లోనూ డబ్బు పంచడం కాని, ఎన్నికల ఖర్చు కోసం ఇతరుల వద్ద చేతులు చాచడం కాని చేసేది లేదని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక తిరుపతి ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా సాధించిన విజయంపై ఆయన పార్టీ నేతల వద్ద ప్రధానంగా ప్రస్తావించారట. చంద్రబాబుతో భేటీ అనంతరం నేతలు, మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికలో డబ్బు పంపిణీ చేయలేదని వారు తెలిపారు. డబ్బు పంచొద్దన్న చంద్రబాబు ఆదేశాలతో తొలుత తాము భయపడ్డామని, అయితే ఫలితాల్లో ఊహించిన దాని కంటే అధిక మెజార్టీ వచ్చిందని వారు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News