: ఫేస్ బుక్ లో పోలీసు అధికారి భార్యకు వలవేసి ఊచలు లెక్కిస్తున్న తెలుగు టీచర్
ఫేస్ బుక్ లో మధ్యవయస్సు వివాహిత మహిళను పరిచయం చేసుకున్న ఓ తెలుగు టీచర్ ప్రేమ పేరుతో దగ్గరై, ఆమెతో సహజీవనం చేసి, ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. హైదరాబాదులో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి తన భార్య కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదును విచారించగా ఈ విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో నివాసం ఉంటూ కాసిపేట మండలంలోని మల్కేపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న చల్లా జ్ఞానేశ్వర్ సామాజిక మాధ్యమాలు వాడి యువతులకు ప్రేమపేరుతో వల వేసి మోసం చేస్తుంటాడు. ఇతనిపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఎస్ఐ భార్యకు మాయమాటలు చెప్పి మంచిర్యాలలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడిని రిమాండుకు తరలించారు.