: అడిలైడ్ లో టీమిండియాకు సెక్యూరిటీ పరీక్ష... బూట్లు విప్పదీస్తే కాని ధోనీకి దక్కని ఎంట్రీ
టీమిండియా సభ్యులు అడిలైడ్ ఎయిర్ పోర్టులో విషమ పరీక్ష ఎదుర్కొన్నారు. ఎయిర్ పోర్టులోకి ప్రవేశం కోసం క్రికెటర్లు సహా, బీసీసీఐ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా నానా పాట్లు పడాల్సి వచ్చింది. ప్రయాణికులను సోదాలు చేసేందుకు అక్కడ ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్ ఒక్కపట్టాన మన క్రికెటర్ల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో మన క్రికెటర్లు చివరకు బూట్లు కూడా విప్పదీయాల్సి వచ్చింది. ఎయిర్ పోర్టులోకి ఎంట్రీ కోసం కెప్టెన్ ధోనీ మూడు సార్లు మెటల్ డిటెక్టర్ ద్వారా వెళ్లాల్సి వచ్చింది. ధోనీ పడ్డ ఇబ్బంది అతడితో పాటు జట్టు సభ్యులను కూడా నవ్వుల్లో ముంచేసిందట. బూట్లకు ఉన్న బకిల్ కారణంగానే మెటల్ డిటెక్టర్ అతడికి ఎంట్రీ ఇవ్వలేదు. దీనిని గుర్తించిన అతడు తన బూట్లను విప్పి, మెటల్ డిటెక్టర్ గ్రీన్ సిగ్నల్ పొందాడు.