: 40 గంటలు... 1,500 ఆసనాలు: హాంకాంగ్ లో 'యోగ్' రాజ్ గిన్నిస్ రికార్డు!
40 గంటల పాటు విరామమన్నదే లేకుండా 1,500 యోగాసనాలతో ప్రవాస భారతీయ యోగా గురువు యోగ్ రాజ్ గిన్నిస్ రికార్డు సృష్టించారు. 29 ఏళ్ల వయసున్న యోగ్ రాజ్, హాంకాంగ్ లో యోగా శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల వయస్సు నుంచే యోగాను అభ్యసించడం మొదలుపెట్టిన యోగ్ రాజ్ తన 12వ ఏట నుంచి యోగాను నేర్పిస్తున్నారు. గిన్నిస్ రికార్డు కోసమే 40 గంటల నిర్విరామ యోగా ఫీట్ చేసిన అతడు, సదరు రికార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా యోగ్ రాజ్ కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.