: కోటప్పకొండ ‘పాట కచేరీ’లపై పోలీసుల ఆంక్షలు... ఆందోళనకు దిగిన ప్రభల నిర్వాహకులు
గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికూటేశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభలపై ఏటా నిర్వహిస్తున్న పాట కచేరీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభల నిర్వాహకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ప్రభలపై ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలను ఆర్పివేశారు. దీంతో అక్కడ చీకట్లు అలముకున్నాయి. పాట కచేరీలకు అనుమతిస్తేనే అక్కడి నుంచి కదులుతామని ప్రభల నిర్వాహకులు చెబుతున్నారు.