: మోదీపై అన్నా హజారే విసుర్లు... బడాబాబుల బాగోగుల కోసమే ప్రధాని తాపత్రయమని వ్యాఖ్య


అవినీతిపై సమరశంఖం పూరించిన సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలో బడా పారిశ్రామికవేత్తల బాగోగుల కోసమే భారత ప్రధాని ఆలోచన చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. భూ సేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఈ నెల 23, 24 తేదీల్లో ఢిల్లీలో చేపట్టనున్న ఆందోళన నేపథ్యంలో హజారే, స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నేడు మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ హవా నానాటికీ తగ్గిపోతోందని ఈ సందర్భంగా అన్నా హజారే అన్నారు. ఎన్నికలకు ముందు దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పిన మోదీ, ఆ రోజులను ఒక్క పారిశ్రామికవర్గానికి మాత్రమే పరిమితం చేశారన్నారు. మోదీ విధానాల వల్ల ప్రపంచంలో దేశ ఖ్యాతి తగ్గిపోతోందని హజారే ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News