: తిరుమల చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు... రేపు సుప్రభాత సేవలో స్వామి దర్శనం
భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల చేరుకున్నారు. లంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలి విదేశీ పర్యటనలో భాగంగా రెండు రోజుల క్రితం సిరిసేన సతీసమేతంగా భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చలు నిర్వహించి, అణు రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకున్న ఆయన కొద్దిసేపటి క్రితం తిరుమల చేరుకున్నారు. రేపు తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొననున్న సిరిసేన దంపతులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.