: బాసరలో అగ్ని ప్రమాదం... అమ్మవారి చీరలకు అంటుకున్న మంటలు
మహాశివరాత్రి పర్వదినాన ఆదిలాబాదు జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయ ప్రాంగణంలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్టోర్ రూంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా ఎగసిపడుతున్న మంటలు స్టోర్ రూంలోని సరస్వతి అమ్మవారి చీరలకు అంటుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో అప్రమత్తమైన ఆలయ సిబ్బంది, భక్తులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం చేరవేసి మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.