: పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి: కేసీఆర్ తో భేటీ తర్వాత ‘మహా’ సీఎం ఫడ్నవీస్


పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే ముందుకెళతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ ముగిసిన తర్వాత ఆయన ఈ మేరకు ప్రకటించారు. గోదావరి జలాల పంపకాలపై కేసీఆర్, ఫడ్నవీస్ సుదీర్ఘంగా చర్చించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పాటవుతున్న అంతరాష్ట్ర నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని తామిద్దరం నిర్ణయం తీసుకున్నామని ఫడ్నవీస్ తెలిపారు. అంతేకాక గోదావరి జలాల పంపకంలో సమన్వయంతో వ్యవహరించాలని కూడా తీర్మానించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News