: బీహార్ రాజకీయాల్లో కొత్త మలుపు... మాంఝీకి మద్దతు పలికిన ఏడుగురు మంత్రులపై జేడీయూ వేటు


క్షణక్షణానికి మారిపోతున్న బీహార్ రాజకీయాలు కొద్దిసేపటి క్రితం కొత్త మలుపు తిరిగాయి. జేడీయూ సీనియర్ నేత నితీశ్ కుమార్ పక్షాన నిలిచిన ఏడుగురు మంత్రులు తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి మద్దతు పలికారు. దీంతో కంగుతిన్న జేడీయూ, మాంఝీకి మద్దతు పలికిన ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పటికే మాంఝీని పార్టీ నుంచి బహిష్కరించిన జేడీయూ, తాజాగా ఏడుగురు మంత్రులనూ బహిష్కరించింది. ఈ చర్యతో నితీశ్ కు మద్దతు తగ్గుతుండగా, మాంఝీ బలం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఈ నెల 20న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరగనున్న విశ్వాస పరీక్షలో మాంఝీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News