: అరేబియాలో పడవ మునక... 78 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్


మహారాష్ట్ర రాజధాని ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న తీరగస్తీ రక్షక దళం(కోస్ట్ గార్డ్) వెనువెంటనే స్పందించింది. తక్షణ సహాయక చర్యలు చేపట్టిన తీరగస్తీ రక్షక దళం పడవలోని 78 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అంతేకాక పడవలో ఎంతమంది ఉన్నారన్న విషయంపైనా స్పష్టమైన సమాచారం లభించలేదు. ప్రస్తుతం అక్కడ కోస్ట్ గార్డ్ ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తోంది.

  • Loading...

More Telugu News