: ధోనీ సేన టైటిల్ ను నిలబెట్టుకుంటుంది: టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ ధీమా


వరల్డ్ కప్ లో భారత జట్టు విజయంపై టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2011లో గెలుచుకున్న టైటిల్ ను టీమిండియా నిలబెట్టుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కథనాలు రాసినా, రాయకపోయినా... టీమిండియా విజయం మాత్రం ఖాయమని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలను ఆయన మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణించారు. ‘‘టీమిండియా టైటిల్ ను నిలబెట్టుకుని తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బలమైన బ్యాంటింగ్ లైనప్ వారి సొంతం. నాకౌట్ దశలో ఎలా ఆడాలన్న విషయం వారికి తెలుసు. 2011లో వారి ప్రదర్శన అద్భుతం’’ అని కిర్ స్టెన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News