: ‘మహా’ సీఎంతో కేసీఆర్ భేటీ... సాగు నీటి ప్రాజెక్టులపై చర్చ


తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఇరు రాష్ట్రాల్లోని సాగు నీటి ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ అటు నుంచి అటే ముంబై వెళ్లారు. ఇరు రాష్ట్రాల మధ్య సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తలెత్తుతున్న వివాదాలు పునరావృతం కాకుండా చూసుకునే దిశగా ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక వర్షాకాలంలో ఇరు రాష్ట్రాల్లో ముంపునకు గురవుతున్న గ్రామాలపైనా వారు చర్చలు జరిపినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News