: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి... భారత్ లో నిరసనల వెల్లువ
అమెరికాలోని హిందూ ఆలయం గోడలపై అభ్యంతరకర రాతలపై భారత్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికార బీజేపీ సహా విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ‘‘మత సామరస్యం విషయంలో అమెరికా వాదన ఒట్టి మాటలకే పరిమితమవుతోంది. హిందూ ఆలయంపై ఈ తరహా చర్యలు సరికావు. దీనిపై అమెరికా అధికారులు సత్వరం స్పందించాలి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే దీనిపై ఓ ప్రకటన చేయాలి’’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీసీ చాకో అన్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనపై బీజేపీ నేతలు కూడా నిరసన వ్యక్తం చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ ఉండి ఉంటే, ఈ ఘటనతో షాక్ కు గురయ్యేవారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. హిందూ ఆలయంపై అమెరికాలో జరిగిన దాడిని మత సామరస్యం కోణంలోనే చూడలేమని ఆయన వ్యాఖ్యానించారు.