: విశాఖ జిల్లాలో వ్యాన్ బీభత్సం... చిన్నారులపైకి దూసుకెళ్లిన వ్యాన్, బాలిక మృతి


విశాఖపట్నం జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన నేడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని హుకుంపేట మండలం రంగశిల వద్ద కొద్దిసేపటి క్రితం అదుపు తప్పిన ఓ వ్యాన్ బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తూ అదుపు తప్పిన సదరు వ్యాన్ నలుగురు చిన్నారుల పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి బాలిక అక్కడికక్కడే మృత్యువాత పడింది. మరో ముగ్గురు చిన్నారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురు చిన్నారుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News