: తిరుపతి ఉప ఎన్నిక తీరు దారుణం... ప్రజాస్వామ్యవాదిగా సిగ్గుపడుతున్నా: రఘువీరారెడ్డి
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక తీరు అత్యంత దారుణమని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా అధికారులు, టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారని కొద్దిసేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో రఘువీరా ఆరోపించారు. అధికారులను లోబరుచుకుని టీడీపీ సర్కారు నిర్వహించిన ఆ ఎన్నికల తీరుకు తాను సిగ్గుపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతల చేత లక్ష ఓట్ల మేర రిగ్గింగ్ జరిగేందుకు తిరుపతి ప్రజలు కూడా సహకరించారని ఆయన విమర్శించారు.