: ముంబై రాజ్ భవన్ లో కేసీఆర్ బర్త్ డే...‘మహా’ గవర్నర్ సమక్షంలో కేక్ కట్ చేసిన కేసీఆర్!


తెలంగాణ సీఎం కేసీఆర్ తన జన్మదిన వేడుకలను కొద్దిసేపటి క్రితం మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రాజ్ భవన్ లో జరుపుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, టీఆర్ఎస్ ఎంపీలు కె. కేశవరావు, వినోద్, తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తదితరుల సమక్షంలో కేసీఆర్ తన బర్త్ డే కేక్ ను కట్ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమయ్యేందుకు ఢిల్లీ నుంచి నిన్న కేసీఆర్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఉన్న పలు ప్రాజెక్టులపై ఆయన ఫడ్నవీస్ తో చర్చించేందుకే ముంబై వెళ్లారు.

  • Loading...

More Telugu News