: తిరుపతి ఎమ్మెల్యేకు చంద్రబాబు అభినందన... విజయం బాధ్యతను పెంచిందన్న సుగుణమ్మ
తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన సుగుణమ్మను ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అభినందించారు. కొద్దిసేపటి క్రితం సుగుణమ్మ హైదరాబాద్ లో చంద్రబాబును కలిశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారని సుగుణమ్మ మీడియాకు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన నిధుల విడుదలలో ప్రాధాన్యాన్నిస్తామని చెప్పారన్నారు. తిరుపతి ప్రజలిచ్చిన అఖండ విజయం తన బాధ్యతను మరింత పెంచిందని ఆమె వ్యాఖ్యానించారు.