: తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్!
తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు గతంలో ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత రాజకీయంగా బద్ధ శత్రువులుగా మారిపోయారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన తర్వాత వారి మధ్య విరోధం మరింత పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు వివాదాలపై వారిద్దరూ మాటల తూటాలు పేల్చుకున్నారు. అయినా, వారి మధ్య వ్యక్తిగత స్నేహం మాత్రం చెక్కుచెదరలేదనే చెప్పాలి. నిత్యం వాద ప్రతివాదాలు చేసుకునే వారిద్దరూ ఎప్పుడు కలిసినా... నవ్వుతూ, తుళ్లుతూ కనిపిస్తుంటారు. తాజాగా నేడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.