: టీమిండియాలో యువీ లేకపోవడం బాధాకరం... కప్ దక్షిణాఫ్రికాదే: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి


వరల్డ్ కప్ లో టీమిండియా కూర్పుపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2011 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా జట్టులో కీలక భూమిక పోషించిన యువరాజ్ సింగ్ కు ప్రస్తుత వరల్డ్ కప్ లో ఆడే అవకాశం రాకపోవడంపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు కూర్పు విషయంలో అసలు బీసీసీఐ సెలెక్టర్ల లాజిక్ ఏమిటో తనకు అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. యువీని పక్కనపెట్టడం తనను అసంతృప్తితో పాటు ఆగ్రహానికి గురి చేసిందన్నాడు. జట్టుకు మెరుగైన సేవలందించిన సీనియర్లకు జట్టులో చోటు దక్కకపోవడంపై శెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీకి మంచి భవిష్యత్తు ఉందన్న అతడు, టీమిండియా పైనల్ అవకాశాలపై పెదవి విరిచాడు. ఈసారి వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాదేనని సునీల్ శెట్టి చెప్పాడు.

  • Loading...

More Telugu News