: ఆయన స్టార్ బ్యాట్స్ మన్... చిన్నాచితకా బౌలర్లను చూసి బెదిరిపోరు: కవిత


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన తనయ కవిత ఆకాశానికెత్తేస్తున్నారు. తన తండ్రి స్టార్ బ్యాట్స్ మన్ అని, చిన్నాచితకా బౌలర్లను చూసి ఆయన బెదిరిపోరని అన్నారు. తెలంగాణ భవన్ లో ఆమె కేసీఆర్ బర్త్ డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తండ్రి పుట్టినరోజున తానే చాక్లెట్లు పట్టుకు తిరిగేదాన్నని గుర్తు చేసుకున్నారు. ఆయనకు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం ఇష్టం ఉండదని వెల్లడించారు. కేసీఆర్ బర్త్ డే అంటే కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకే స్పెషల్ అని వివరించారు. అన్ని రోజుల్లానే పుట్టినరోజును కూడా ఒకేలా భావిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News