: పట్టాలపై పడినా... శిశువు క్షేమం!


రాజస్థాన్ లో ఓ మహిళ రైలు టాయిలెట్లో ప్రసవించింది. అయితే, శిశువు టాయిలెట్లోంచి రైలు పట్టాలపై పడిపోయినా, ఆశ్చర్యకరంగా ఎలాంటి హాని కలగలేదు. మన్ను అనే యువతి భర్తతో కలిసి సూరత్ గఢ్ నుంచి హనుమాన్ గఢ్ ప్రయాణిస్తోంది. రైలులో ప్రయాణిస్తుండగానే పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో, టాయిలెట్లోకి వెళ్లి అతికష్టమ్మీద మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే, ఆ శిశువు టాయిలెట్ పైపులోంచి పట్టాలపై పడిపోయినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. పట్టాలపై శిశువును గుర్తించిన ఎఫ్ సీఐ గార్డు రైల్వే అధికారులకు సమాచారం తెలుపగా, వారు శిశువును స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు, బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే మన్ను సొమ్మసిల్లి పడిపోయింది. దాంతో, ఆమెను హనుమాన్ గఢ్ ఆసుపత్రికి తరలించారు. తాజాగా శిశువును కూడా ఆమె చెంతకు చేర్చారు.

  • Loading...

More Telugu News