: ఆ 'ఫెవిక్విక్ యాడ్' అంత అభ్యంతరకరమా?


ఇటీవల టీవీ చానళ్లలో దర్శనమిస్తున్న ఫెవిక్విక్ యాడ్ చూశారా? అందులో, బోర్డర్లో నిర్వహించే 'బీటింగ్ ద రిట్రీట్' సందర్భంగా ఓ భారత సైనికుడు పాకిస్థాన్ సోల్జర్ బూటును ఫెవిక్విక్ తో అతికించడం కనిపిస్తుంది. దీనిపై ఇప్పుడు హిందూ జనజాగృతి సమితి (హెచ్ జేఎస్) అభ్యంతరం చెబుతోంది. ఈ యాడ్ పై ఫెవిక్విక్ తయారీదారు పిడిలైట్ సంస్థ క్షమాపణలు చెప్పాల్సిందేని హెచ్ జేఎస్ డిమాండ్ చేస్తోంది. సరిహద్దుల్లో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్న మన సైనికులను అసమంజసమైన రీతిలో చిత్రీకరించారని హెచ్ జేఎస్ జాతీయ ప్రతినిధి రమేశ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాత్రింబవళ్లు మన సైనికులు సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుంటే, ఇలాంటి యాడ్ లు రూపొందించడం దేశ ప్రజల మనోభావాలను గాయపర్చడమేనని అన్నారు. ఈ యాడ్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకుంటే, పిడిలైట్ సంస్థకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News