: అనుచరగణంతో శ్రీకాళహస్తి ఆలయంలో ప్రవేశించిన మంత్రి బొజ్జల... భక్తులకు దర్శనం నిలిపివేత
శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చారు. అయితే, మంత్రి తన అనుచరగణంతో ఆలయంలోకి ప్రవేశించడంతో భక్తులకు తీవ్ర అసౌకర్యం వాటిల్లింది. ఆలయంలోకి ప్రవేశించిన మంత్రి అనుచరులు హల్ చల్ చేశారు. ఈ క్రమంలో రెండు గంటల పాటు దర్శనం నిలిపివేశారు. కాగా, ఇక్కడి వాయులింగేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో, ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.