: రామ్ చరణ్ విమానాలు... ఈ వేసవిలో వచ్చేస్తున్నాయి!


టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ విమానయాన రంగంలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు చెందిన టర్బో మేఘా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు డీజీసీఏ అనుమతులు మంజూరు చేసింది. ఈ క్రమంలో, టర్బో మేఘా ఏప్రిల్ నుంచి సర్వీసులను ఆరంభించే అవకాశాలున్నాయి. 72 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాలను హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, ఔరంగాబాద్ రూట్లలో ప్రవేశపెడతామని సంస్థ ఎండీ వంకాయలపాటి ఉమేశ్ తెలిపారు. తాజాగా, డీజీసీఏ ఆరు విమానయాన సంస్థలకు అనుమతులిచ్చింది. వాటిలో చెర్రీకి చెందిన సంస్థ కూడా ఉంది.

  • Loading...

More Telugu News