: పసికూనపై కాస్త కష్టపడి గెలిచారు!


గ్రూప్ మ్యాచ్ లో స్కాట్లాండ్ పై న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... కివీస్ జట్టు 24.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు చివర్లో స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు చేజార్చుకుంది. లక్ష్యం పెద్దది కాకపోవడంతో కివీస్ జట్టు బతికిపోయింది. కివీస్ ఇన్నింగ్స్ లో కేన్ విలియమ్సన్ (38) టాప్ స్కోరర్. ఇలియట్ 29 పరుగులు చేశాడు. ఓపెనర్ గా బరిలో దిగిన కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 15 పరుగులతో నిరాశపరిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో వార్డ్ లా, డేవీ చెరో 3 వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ ఓడిన స్కాట్లాండ్ బ్యాటింగ్ కు దిగింది. ఓవర్లన్నీ ఆడకుండానే 36.2 ఓవర్లలో ఆ జట్టు 142 పరుగులకు ఆలౌటైంది. స్కాటిష్ జట్టును ఆరంభంలో హడలెత్తించిన కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.

  • Loading...

More Telugu News