: లోయలో పడిపోయిన ప్రైవేటు బస్సు... 10 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్ లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో 10 మంది దుర్మరణం పాలయ్యారు. బస్సు ఇండోర్ నుంచి రాజస్థాన్ లోని గలియాకోట్ వెళుతుండగా ధార్ జిల్లా మచాలియా ఘాట్ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. డ్రైవర్ స్టీరింగ్ పై అదుపు కోల్పోవడంతో బస్సు లోయలో పడిపోయిందని అధికారులు పేర్కొన్నారు. గాయపడిన 40 మంది ప్రయాణికులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ధార్, ఝబువా జిల్లాల అధికారులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.