: వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ
మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని, కరీంనగర్ జిల్లాలో కొలువై ఉన్న వేములవాడ రాజరాజేశ్వరస్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పట్టువస్త్రాలు సమర్పించింది. కాగా, ఈ ఉదయం నుంచే వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణ చేస్తూ పరవశించిపోతున్నారు. అటు, హన్మకొండ వేయిస్తంభాల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు పూజలు చేస్తున్నారు. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.