: స్కాట్లాండ్ జట్టును అతలాకుతలం చేసిన కివీస్ బౌలర్లు


వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. డ్యునెడిన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు 36.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై కివీస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. వారిని నిలువరించడం స్కాటిష్ బ్యాట్స్ మెన్ కు శక్తికి మించిన పనైంది. మాట్ మచాన్ (56), రిచీ బెర్రింగ్టన్ (50) రాణించడంతో స్కాట్లాండ్ ఆమాత్రం స్కోరైనా నమోదు చేయగలిగింది. 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ ను మచాన్, బెర్రింగ్టన్ జోడీ ఆదుకుంది. కివీస్ బౌలర్లలో వెటోరీ, ఆండర్సన్ చెరో 3 వికెట్లు తీయగా... సౌథీ, బౌల్ట్ రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం, స్వల్ప లక్ష్యఛేదనకు ఉపక్రమించిన ఆతిథ్య న్యూజిలాండ్ 3.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. 17 పరుగులు చేసిన ఓపెనర్ మార్టిన్ గప్టిల్... వార్డ్ లా బౌలింగ్ లో వెనుదిరిగాడు.

  • Loading...

More Telugu News