: తిరుమల తలనీలాలు ఇక ఇ-వేలం ద్వారా విక్రయం
తమ కోర్కెలు తీరితే, కష్టాలు తొలగిపోతే తలనీలాలు సమర్పిస్తామని తిరుమల వెంకన్నకు భక్తులు మొక్కుకోవడం తెలిసిందే. అలా భక్తులు సమర్పించే తలనీలాల రూపంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జిస్తుంది. ఇకపై తలనీలాలను ఇ-వేలం ద్వారా విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. మార్చి 5న ఈ నూతన విధానం ద్వారా వేలం నిర్వహిస్తారు. విశాఖలోని మెటల్ స్క్రాప్ రేటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో ఇ-వేలం ప్రక్రియ చేపట్టనున్నారు.