: రాజ్ నాథ్ ప్రసంగిస్తుండగా సొమ్మసిల్లి పడిపోయిన మహిళా ఏసీపీ


ఎన్నికల సభలు, రాజకీయ నేతల పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసే బందోబస్తు అంటే పోలీసులు హడలిపోతుంటారు. వేళకు తిండి దొరకదు, కూర్చునేంత తీరిక ఉండదు. ఒక్కోసారి రోజుల తరబడి వారు అలానే ఉండాలి. ఈ క్రమంలో పోలీసులు అస్వస్థతకు గురవుతుంటారు కూడా. తాజాగా, ఢిల్లీ పోలీసు రైజిండ్ డే పరేడ్ లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగం కొనసాగుతుండగా, ఏసీపీ నియతి మిట్టల్ కళ్లు తిరిగి కిందపడిపోయారు. ఇది గమనించిన రాజ్ నాథ్ పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండా తన ప్రసంగం కొనసాగించారు. అటు, పురుష పోలీసులు ఇలాంటివి కామనే అన్నట్టు వ్యవహరించారు. పరేడ్ నిర్వహణ కోసం ఆమె చాలా శ్రమించిన కారణంగానే సొమ్మసిల్లి పడిపోయి ఉంటారని సహ ఉద్యోగినులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News