: ఆర్.ఆర్. పాటిల్ మృతికి ప్రధాని మోదీ సంతాపం
ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి ఆర్.ఆర్. పాటిల్ (57) మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో శూన్యం మిగిల్చిందని అన్నారు. పాటిల్ కుటుంబానికి మోదీ సానుభూతి తెలిపారు. ఆయన మరణవార్త విన్న వెంటనే బాధపడ్డానని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించారు. 26/11 దాడుల సమయంలో పాటిల్ మహారాష్ట్ర హోం మంత్రిగా వ్యవహరించారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ముంబయి లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మరణించారు.