: అసిస్టెంట్ ఆచార్యులవారు... 'షీ టీమ్' కు దొరికిపోయారు!


ఆయనో అసిస్టెంట్ ప్రొఫెసర్! విద్యార్థులను సన్మార్గంలో నడిపేందుకు కృషి చేయాల్సిన ఆ అయ్యవారు దారి తప్పారు. అమ్మాయిలను వేధిస్తూ చివరికి పోలీసులకు దొరికిపోయిన ఘటన సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఆకతాయిల ఆటకట్టించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యేకంగా షీ టీమ్ లను రంగంలోకి దింపడం తెలిసిందే. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం... షీ టీమ్ బృందాలు సోమవారం సైబరాబాదులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా, మహిళల పట్ల వెకిలిగా ప్రవర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రైవ్ లో మొత్తం 27 మందిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News